NEWSTELANGANA

త‌ప్పుడు స‌మాచారం ప్ర‌మాదం

Share it with your family & friends

ఉడుముల సుధాక‌ర్ రెడ్డి కామెంట్

హైద‌రాబాద్ – టెక్నాల‌జీ ప‌రంగా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయ‌ని దీని కార‌ణంగా స‌మాచారం అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంద‌న్నారు ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ , సీనియ‌ర్ ఎడిట‌ర్ ఉడుముల సుధాక‌ర్ రెడ్డి. తెలంగాణలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యా సంస్థలలో అర్హులైన , వెనుకబడిన విద్యార్థులకు మీడియా అక్షరాస్యత శిక్షణా కార్యక్రమం చేప‌ట్టారు. దీనికి ఉడుముల సుధాక‌ర్ రెడ్డి నాయకత్వం వహించారు.

రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లోని అంకుషాపూర్‌లో అమెరికా కాన్సులేట్‌లోని అమెరికన్ కార్నర్ ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. మూడు కళాశాలల్లో, ఇతర శిక్షకులతో కలిసి సుధాక‌ర్ రెడ్డి విద్యార్థులకు తప్పుడు సమాచారాన్ని గుర్తించడం, వాస్తవ తనిఖీ సాధనాలను ఉపయోగించడంపై అవ‌గాహ‌న క‌ల్పించారు.

అంతే కాకుండా తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడానికి వ్యూహాలపై అవగాహన కల్పించారు ప్రధానంగా మహిళా విద్యార్థులు, జర్నలిజం, సైన్స్, కళలతో సహా విభిన్న విద్యా నేపథ్యాలకు ప్రాతినిధ్యం వహించారు. మొత్తంగా త‌ప్పుడు స‌మాచారం ప‌ట్ల జాగ్ర‌త్త‌తో ఉండాల‌ని సూచించారు ఉడుముల సుధాక‌ర్ రెడ్డి.