కన్నడ నాట ఓట్ల జాతర
ఓటు వేసిన మన్సూర్ ఖాన్
కర్ణాటక – కన్నడ నాట ఓట్ల జాతర మొదలైంది. పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా ఓటు వేసేందుకు జనం రోడ్ల మీదకు వచ్చారు. అసలైన ప్రజాస్వామ్యం ఏమిటంటే ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించు కోవడమేనని అమెరికా దేశ అధ్యక్షుడు దివంగత అబ్రహం లింకన్.
ఇది పక్కన పెడితే ఇప్పటికే దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తొలి విడతలో 105 సీట్లకు పోలింగ్ జరిగింది. ప్రస్తుతం రెండో విడత కింద పోలింగ్ ప్రారంభమైంది. ప్రధానంగా రాష్ట్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీకి బిగ్ షాక్ తగిలింది.
కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివకుమార్ ఆధ్వర్యంలో ఊహించని రీతిలో పవర్ లోకి వచ్చింది. సీఎం సిద్దరామయ్య, డీకే సారథ్యంలో ప్రస్తుతం కన్నడ నాట కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరింది. ఇప్పుడు మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీకి , దాని అనుబంధ పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి మధ్య పోరు కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా బెంగళూరు సెంట్రల్ నుంచి కాంగ్రెస్ తరపున బరిలో ఉన్న మన్సూర్ ఖాన్ శుక్రవారం తన భార్యతో కలిసి ఓటు వేశారు. తన విజయం తథ్యమని , బీజేపీ ఓడి పోవడం ఖాయమని జోష్యం చెప్పారు.