NEWSANDHRA PRADESH

తండ్రిని మోసం చేసిన జ‌గ‌న్

Share it with your family & friends

సీబీఐ ఛార్జ్ షీట్ లో చేర్పించింది త‌నే

అమ‌రావ‌తి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ సీఎం , త‌న సోద‌రుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దారుణ‌మైన కామెంట్స్ చేశారు. త‌న తండ్రిని మోసం చేశాడంటూ వాపోయారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పేరును సీబీఐ ఛార్జిషీట్ లో చేర్పించింది కాంగ్రెస్ పార్టీ కాద‌ని, దానిని కావాల‌ని చేర్పించేలా చేసింది వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అంటూ బాంబు పేల్చారు.

శుక్ర‌వారం ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. కేసుల నుంచి బ‌య‌ట ప‌డేందుకు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కావాల‌ని పిటిష‌న్ వేయించాడ‌ని ఆరోపించారు. పొన్న‌వోలు సుధాక‌ర్ రెడ్డితో హైకోర్టులో పిటిష‌న్ వేయించింది ఎవ‌రో కాద‌ని త‌న సోద‌రుడేనంటూ మండిప‌డ్డారు.

ఇందుకు బ‌హుమానంగా భారీ గిఫ్ట్ సుధాక‌ర్ రెడ్డికి ఇచ్చాడంటూ ఆరోపించారు. ఏపీ హైకోర్టులో అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టాడ‌ని, ఇంత‌కంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా అని ప్ర‌శ్నించారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. వైఎస్సార్ పై సీబీఐ ఛార్జ్ షీట్ లో త‌మ పార్టీ పాత్ర లేనే లేదంటూ స్ప‌ష్టం చేశారు.