NEWSNATIONAL

యూపీలో రాజ‌కీయ భూకంపం

Share it with your family & friends

ప్ర‌ముఖ మేధావి యోగేంద్ర యాద‌వ్
న్యూఢిల్లీ – స్వ‌రాజ్ ఇండియా పార్టీ అధ్య‌క్షుడు, ప్ర‌ముఖ మేధావి యోగేంద్ర యాద‌వ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. శుక్ర‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న స్పందించారు. ఎన్నిక‌ల‌పై త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నారు.

యూపీలో రాజ‌కీయ భూకంపం వ‌చ్చే ఛాన్స్ ఉంద‌న్నారు. మీర‌ట్ నుంచి బ‌నార‌స్ దాకా 15 పార్ల‌మెంట్ సీట్ల‌లో గ్రామీణ ఓట‌ర్లు గంప గుత్త‌గా బీజేపీకి వ్య‌తిరేకంగా ఉన్నార‌న్న విష‌యం అర్థ‌మైంద‌న్నారు. వారితో తాను స్వ‌యంగా మాట్లాడాన‌ని పేర్కొన్నారు.

దీనిని బ‌ట్టి చూస్తే బీజేపీకి ఓట్లు ఆశించిన మేర రావ‌డం లేద‌ని తేలి పోయింద‌ని స్ప‌ష్టం చేశారు యోగేంద్ర యాద‌వ్. 70 సీట్లు దేవుడెరుగు..క‌నీసం గ్రౌండ్ రిపోర్టును బ‌ట్టి చూస్తే ఆ సంఖ్య 50 కి మించి దాట‌ద‌ని తేలి పోయింద‌న్నారు.

మోదీ కంటే ఎక్కువ జ‌నాద‌ర‌ణ క‌లిగిన నాయ‌కుడిగా యోగీ ముందుకు వ‌చ్చార‌ని, లా అండ్ ఆర్డ‌ర్ ను కంట్రోల్ పెట్ట‌డంలో స‌క్సెస్ అయ్యార‌ని తెలిపారు. బీజేపీ ఎంపీలు, స్థానిక నేత‌ల‌పై తీవ్ర‌మైన కోపంతో జ‌నం ఉన్నార‌ని తెలిపారు. బీజేపీ ఓట‌ర్ల‌లో నాలుగింట ఒక వంతు ఈసారి ఆ పార్టీకి ఓటు వేయ‌మంటూ ఖ‌రాకండిగా చెప్పార‌ని పేర్కొన్నారు యోగేంద్ర యాద‌వ్.