మోడీ కనికట్టు దేశం తాకట్టు
నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దేశానికి అప్పులు తప్ప ఏమీ మిగిల్చక పోవడం దారుణమన్నారు. గతంలో ఏలిన వారి కంటే తనే రికార్డు సృష్టించాడని అప్పులు చేయడంలో అంటూ ఎద్దేవా చేశారు సీఎం.
1947 నుండి 2014 వరకు 67 సంవత్సరాలలో 14 ప్రధాన మంత్రులు చేసిన అప్పు ₹55 లక్షల కోట్లు అన్నారు. కానీ 2014 నుండి 2024 వరకు నరేంద్ర మోడీ ఒక్కరే చేసిన అప్పు రూ. 113 లక్షల కోట్లు అని సంచలన విషయం బయట పెట్టారు.
దేశం మీద ఉన్న అప్పుల భారం రూ. 168 లక్షల కోట్లు అని చెప్పారు రేవంత్ రెడ్డి. 14 ప్రధాన మంత్రులు చేసిన అప్పు కంటే నరేంద్ర మోడీ ఒక్కడే రెండింతలు అప్పు చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ బతుకుతున్న 143 కోట్ల మందిపై ఎనలేని భారం మోపాడని ఆరోపించారు.
మరోసారి గనుక మోదీని ఎన్నుకుంటే దేశం మొత్తాన్ని గంప గుత్తగా అదానీ, అంబానీ, బడా బాబులకు అమ్మేస్తాడని మండిపడ్డారు ఎనుముల రేవంత్ రెడ్డి. ఇకనైనా ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.