TELANGANANEWS

హ‌రీశ్ రావు రాజీనామా ఓ డ్రామా

Share it with your family & friends

నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – ద‌మ్ముంటే త‌ను రాజీనామా చేయాల‌ని ప‌దే ప‌దే స‌వాల్ విసురుతున్న మాజీ మంత్రి హ‌రీశ్ రావుపై నిప్పులు చెరిగారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఎవ‌రికి ద‌మ్ముంద‌నేది ఇప్ప‌టికే ప్ర‌జ‌లు తేల్చార‌ని చెప్పారు. ఆ మాత్రం తెలుసు కోకుండా కేవ‌లం ప్ర‌చారం కోసం రాజ‌కీయాలు చేయాల‌ని అనుకోవ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

ఎవ‌రి స‌త్తా ఏమిటో రేపు జ‌రిగే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో తేలుతుంద‌న్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాను చెప్పిన‌ట్టుగానే పంధ్రాగ‌ష్టు లోపు రైతులు తీసుకున్న రూ. 2 ల‌క్ష‌ల రుణాల‌ను అన్నింటిని తూచ త‌ప్ప‌కుండా మాఫీ చేస్తాన‌ని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు.

కావాల‌ని హ‌రీశ్ రావు చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్నాడ‌ని, ఇదంతా మామా అల్లుళ్లు ఆడుతున్న నాట‌క‌మ‌ని కొట్టి పారేశారు. త‌ను రాజీనామా చేయాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు. ఆనాడు ఉద్య‌మ కాలంలో నిరుద్యోగుల‌ను, యువ‌త‌ను బ‌లి తీసుకున్న వ్య‌క్తివి నువ్వు కాదా అని హ‌రీశ్ రావును ఉద్దేశించి ప్ర‌శ్నించారు సీఎం.

నీకు అంత సీన్ లేద‌న్నారు. ఈ ప‌దేళ్ల కాలంలో ఏనాడైనా అమ‌ర వీరుల స్థూపం వ‌ద్ద‌కు వెళ్లావా అని నిల‌దీశారు.