రౌడీలు..గూండాలకు భయపడం
నాగ బాబు షాకింగ్ కామెంట్స్
మంగళగిరి – జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ నటుడు కొణిదెల నాగ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాయలం నుంచి మాట్లాడారు. వీడియో సందేశం ద్వారా కీలక కామెంట్స్ చేశారు. కడప నుండి రౌడీలు, గూండాలు వస్తున్నారని తమకు సమాచారం ఉందన్నారు.
ఎంత మంది వచ్చినా తాము ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు నాగ బాబు. ఎవరికీ భయపడే ప్రసక్తి లేదన్నారు. తమ తమ్ముడు, జనసేనాని, పవర్ స్టార్ దమ్మున్నోడని అన్నారు. ఒక్క అంగుళం కూడా కదలించే శక్తి ఏ ఒక్కడికీ ఈ ప్రాంతంలో లేనే లేదన్నారు.
జనసేన కూటమి విజయం సాధించడం తప్పదన్నారు. జనం మార్పు కోరుకుంటున్నారని ఇక జగన్ మోహన్ రెడ్డి, ఆయన పరివారం ఇంటికి వెళ్లక తప్పదని జోష్యం చెప్పారు నాగ బాబు. ఇకనైనా చిల్లర వేషాలు, రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు.
ప్రజలు జగన్ రెడ్డి పాలనతో విసిగి పోయారని, ఇక ప్రజా పాలన రావాలని కోరుకుంటున్నారని, రాక్షస పాలన కాదన్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ప్రజలే చూస్తారని అన్నారు నాగ బాబు.