అబద్దాల పుట్ట మోదీ దిట్ట
రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్
న్యూఢిల్లీ – పదేళ్ల కాలం పాటు దేశానికి ప్రదానమంత్రిగా నరేంద్ర మోదీ చేసింది ఏమీ లేదన్నారు ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ. అబద్దాలు చెప్పడంలో, మోసం చేయడంలో పీఎంను మించిన వ్యక్తి ఈ దేశంలోనే లేరంటూ ఎద్దేవా చేశారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే దేశం వందేళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. మరోసారి గనుక ఆయనను గెలిపిస్తే చివరకు దేశాన్ని కూడా అమ్మేస్తాడంటూ హెచ్చరించారు రాహుల్ గాంధీ.
తమ మేనిఫెస్టో గురించి అవాకులు, చెవాకులు పేలిన మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూ, సిక్కు దేవతల పేరు చెప్పి ప్రజలను ఓట్లు వేయమని అడిగితే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు రాహుల్ గాంధీ.
అసలు ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థ అనేది ఒకటి ఉందన్న అనుమానం కలుగుతోందన్నారు. ఇకనైనా మోదీని కంట్రోల్ చేయాలని సూచించారు. లేక పోతే ఆయన అబద్దాలతో ప్రయాణం చేస్తున్నారంటూ మండిపడ్డారు.