పంజాబ్ ప్రతాపం కోల్ కతా పరాజయం
ఈడెన్ గార్డెన్స్ లో పరుగుల వరద ప్రవాహం
కోల్ కతా – ఐపీఎల్ 2024లో అద్భుతమైన రికార్డ్ నమోదైంది. రికార్డుల మోత మోగింది ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కీలక లీగ్ పోరులో. అంచనాలకు మించి పంజాబ్ కింగ్స్ ఎలెవన్ దుమ్ము రేపింది. అద్భుతమైన విధ్వంసకరమైన ఆట తీరుతో విస్తు పోయేలా చేశారు.
భారీ లక్ష్యాన్ని అవలీలగా ఛేదించి ఔరా అనిపించేలా చేశారు. అన్ క్యాప్డ్ ప్లేయర్లు సెన్సేషన్ ఇన్నింగ్స్ ఆడడం క్రికెట్ ప్రేమికులకు మరింత సంతోషాన్ని ఇచ్చింది. 262 రన్స్ టార్గెట్ ను ఛేదించడం అరుదైన ఘనత. ఈ క్రెడిట్ పూర్తిగా పంజాబ్ కు దక్కింది.
బ్యాటర్లు రెచ్చి పోయారు. కోల్ కతా నైట్ రైడర్స్ ను ఏకి పారేసింది. ఫామ్ లో లేని బెయిర్ స్టో చితక్కొట్టాడు. అజేయ సెంచరీతో నిలిచాడు. శశాంక్ సింగ్ కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. తను కీలకమైన పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో 37 ఫోర్లు 42 సిక్సర్లు కొట్టారు ఇరు జట్ల ఆటగాళ్లు. ఇది కూడా ఓ రికార్డే.
ఇక మైదానంలోకి దిగిన వెంటనే దంచి కొట్టడం ప్రారంభించారు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ , బెయిర్ స్టో .ఆకాశమే హద్దుగా చెలరేగారు. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ కతా రెచ్చి పోయి ఆడినా ఫలితం లేకుండా పోయింది. బౌలర్లు తేలి పోయారు పంజాబ్ ఆట ముందు.
విచిత్రం ఏమిటంటే 18.4 ఓవర్లలోనే టార్గెట్ ను పూర్తి చేశారు. కోల్ కతా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 261 రన్స్ చేసింది. ఫిల్ సాల్ట్ 37 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు 6 సిక్సర్లతో 75 రన్స్ తో రెచ్చి పోయాడు. సునీల్ సరైన్ మరోసారి రాణించాడు. 32 బాల్స్ ఎదుర్కొని 9 ఫోర్లు 4 సిక్సర్లతో దుమ్ము రేపాడు. 71 రన్స్ చేశాడు. భారీ స్కోర్ సాయడంలో ముఖ్య భూమిక చేపట్టాడు.
ఇక పంజాబ్ విషయానికి వస్తే వచ్చీ రావడంతోనే కోల్ కతా బౌలర్లపై దాడికి దిగారు. జానీ బెయిర్ స్టో 48 బంతుల్లో 8 ఫోర్లు 9 సిక్సర్లతో 108 రన్స్ చేశాడు. ఇక యంగ్ క్రికెటర్ శశాంక్ సింగ్ కేవలం 28 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. 86 పరుగులు చేశాడు. ఇందులో 2 ఫోర్లు 8 సిక్సర్లు ఉన్నాయి. ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ కోల్ కతాకు చుక్కలు చూపించాడు. 20 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ఈ క్రికెటర్ 54 రన్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు 5 సిక్సర్లు ఉన్నాయి. పిచ్చి కొట్టుడు కొట్టిన బెయిర్ స్టోకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.