SPORTS

బెయిర్ స్టోనా మ‌జాకా

Share it with your family & friends

అజేయ సెంచ‌రీతో షాక్

కోల్ క‌తా – స్వంత గ‌డ్డ‌పై విజేత‌గా నిల‌వాల‌ని ఆశించిన కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లారు పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ ఆట‌గాళ్లు. పూన‌కం వ‌చ్చిన వారిలో రెచ్చి పోయారు. మైదానం న‌లు మూల‌లా క‌ళ్లు చెదిరే షాట్స్ తో విస్తు పోయేలా చేశారు.

ముందుగా బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 261 ర‌న్స్ చేసింది. ఐపీఎల్ 2024 చ‌రిత్రలో ఇది అరుదైన రికార్డ్ గా న‌మోదు కావ‌డం విశేషం. ఒకే ఒక్క మ్యాచ్ లో ఇరు జ‌ట్లు క‌లిసి 37 ఫోర్లు 42 సిక్స‌ర్లు కొట్ట‌డం అరుదు.

నిన్న‌టి దాకా అటు ఇటూ ఆడుతూ వ‌చ్చిన బెయిర్ స్టో శివ మెత్తాడు. చిచ్చ‌ర పిడుగులా చెల‌రేగాడు. కోల్ క‌తా బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. అత‌డితో పాటు ప్ర‌భ్ మ‌న్ సింగ్ , శ‌శాంక్ సింగ్ ఇద్ద‌రూ తామేమీ త‌క్కువ కాదంటూ ప్రూవ్ చేసుకున్నారు. జ‌ట్టుకు అద్బుత‌మైన విజ‌యాన్ని సాధించి పెట్టారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే 262 భారీ ల‌క్ష్యాన్ని అవ‌లీల‌గా ఛేదించారు. కేవ‌లం 18.4 బంతుల్లో ప‌ని పూర్తి కానిచ్చేశారు. భారీ ఛేద‌న‌లో ఇది ఓ రికార్డు. జానీ బెయిర్ స్టో 48 బంతుల్లో 8 ఫోర్లు 9 సిక్స‌ర్ల‌తో 108 ర‌న్స్ చేశాడు. ఇక యంగ్ క్రికెట‌ర్ శ‌శాంక్ సింగ్ కేవ‌లం 28 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్నాడు.

86 ప‌రుగులు చేశాడు. ఇందులో 2 ఫోర్లు 8 సిక్స‌ర్లు ఉన్నాయి. ఓపెన‌ర్ ప్ర‌భ్ సిమ్రాన్ సింగ్ కోల్ క‌తాకు చుక్క‌లు చూపించాడు. 20 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న ఈ క్రికెట‌ర్ 54 ర‌న్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు 5 సిక్స‌ర్లు ఉన్నాయి