SPORTS

ఈడెన్ మైదానం ప‌రుగుల ప్ర‌వాహం

Share it with your family & friends

37 ఫోర్లు 42 సిక్స‌ర్లతో అరుదైన రికార్డ్

కోల్ క‌తా – ప్ర‌పంచమంతా విస్తు పోయేలా ఐపీఎల్ లీగ్ మ్యాచ్ రికార్డ్ బ్రేక్ చేసింది. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా ఒకే ఒక్క మ్యాచ్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ , పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ ఇరు జ‌ట్లు క‌లిసి 37 ఫోర్లు , 42 సిక్స‌ర్లు కొట్టాయి. వ‌ర‌ల్డ్ లీగ్ మ్యాచ్ ల‌లో ఇది అరుదైన ఘ‌న‌త‌గా వినుతికెక్కింది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ఇరు జ‌ట్లు క‌లిసి ఫోర్ల ప‌రంగా 148 ర‌న్స్ చేస్తే సిక్స‌ర్ల ప‌రంగా ఏకంగా 252 ర‌న్స్ చేశాయి. మొత్తంగా ఫోర్లు , సిక్స‌ర్ల‌తో క‌లిపి 400 ర‌న్స్ కొట్టారు. రెండు టీమ్ లు క‌లిసి మొత్తం 523 ప‌రుగులు సాధించ‌డం విశేషం.

పంజాబ్ జ‌ట్టు 18.4 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 2 వికెట్లు కోల్పోయి 262 ర‌న్స్ చేసింది. బెయిర్ స్టో 108 ర‌న్స్ చేస్తే , శ‌శాంక్ సింగ్ 68 ప‌ర‌గుల‌తో రెచ్చి పోయాడు. ఇక ప్ర‌భ్ సిమ్రాన్ సింగ్ 54 చేశాడు. ఇక కోల్ కతా నైట్ రైడ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 261 ర‌న్స్ చేసింది.

అందులో ఫిల్ సాల్ట్ 37 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు 6 సిక్స‌ర్ల‌తో 75 ర‌న్స్ తో ఆక‌ట్టుకోగా సునీల్ స‌రైన్ మ‌రోసారి రాణించాడు. 32 బాల్స్ ఎదుర్కొని 9 ఫోర్లు 4 సిక్స‌ర్ల‌తో దుమ్ము రేపాడు. 71 ర‌న్స్ చేశాడు. భారీ స్కోర్ సాయ‌డంలో ముఖ్య భూమిక చేప‌ట్టాడు.