NEWSANDHRA PRADESH

తెలుగు జాతిని నెంబ‌ర్ వ‌న్ చేస్తా

Share it with your family & friends

టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి – తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌తి రోజూ ప్ర‌తి నిమిషం తాను ప‌ని గురించి ఆలోచిస్తాన‌ని చెప్పారు. అంతే కాదు ప్ర‌పంచంలో ఎక్క‌డ తెలుగు వారున్నా, వారంతా బాగుండాల‌ని కోరుకుంటాన‌ని అన్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న ప‌వ‌న్ కళ్యాణ్ తో క‌లిసి ప్ర‌చారం చేప‌ట్టారు.

ఈ సంద‌ర్బంగా తెలుగు ద‌నం, సంస్కృతి, నాగ‌రిక‌త‌, తెలుగు ప్ర‌జ‌ల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు నారా చంద్ర‌బాబు నాయుడు. తెలుగు జాతిని ప్ర‌పంంచ‌లోనే నెంబ‌ర్ వ‌న్ గా చేస్తానంటూ ప్ర‌క‌టించారు . త‌న ల‌క్ష్యం, ప‌రామ‌ర్థం ఒక్క‌టేనని అంది తెలుగు వారంతా ప్ర‌తి రంగంలో టాప్ లో ఉండాల‌ని అన్నారు టీడీపీ చీఫ్‌.

ఆఖరి శ్వాస వరకు తెలుగు వారి కోసమే పనిచేస్తాన‌ని చెప్పారు. పునర్జన్మ అనేది ఉంటే మళ్ళీ తెలుగు వాడిగానే పుట్టాల‌ని త‌న‌కు కోరిక‌గా ఉంద‌న్నారు. ఇదిలా ఉండ‌గా నారా చంద్ర‌బాబు నాయుడు చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఆయ‌న తెలుగు వారి మీద చేసిన వ్యాఖ్య‌ల‌పై భ‌గ్గుమ‌న్నారు ఎంపీ విజ‌య సాయి రెడ్డి.