NEWSANDHRA PRADESH

వైసీపీ ల‌క్ష్యం మైనార్టీల సంక్షేమం

Share it with your family & friends

ఎంపీ అభ్య‌ర్థి విజ‌య సాయి రెడ్డి

నెల్లూరు జిల్లా – త‌మ పార్టీ ల‌క్ష్యం మైనార్టీల సంక్షేమం అని స్ప‌ష్టం చేశారు రాజ్య స‌భ స‌భ్యుడు, వైసీపీ నెల్లూరు లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం పార్టీ అభ్య‌ర్థి విజ‌య సాయి రెడ్డి. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా అంద‌రికంటే ముందంజ‌లో కొన‌సాగుతున్నారు. ఆయ‌న ప్ర‌ధానంగా టీడీపీ కూట‌మిని ఏకి పారేస్తూ వ‌స్తున్నారు. ప్ర‌ధానంగా చంద్ర‌బాబు నాయుడును , పొంగూరు నారాయ‌ణ‌ను వ‌ద‌ల‌డం లేదు.

తాజాగా ముస్లింల‌తో విజ‌య సాయి రెడ్డి ముఖా ముఖి నిర్వ‌హించారు. వారు లేవ‌నెత్తిన స‌మ‌స్య‌ల‌ను సావ‌ధానంగా విన్నారు. త‌మ ప్ర‌భుత్వం ప్ర‌ధానంగా మైనార్టీల అభివృద్దే ల‌క్ష్యంగా ప‌ని చేస్తోంద‌ని చెప్పారు. ఇవాళ దేశంలో ఎక్క‌డా లేని విధంగా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్న ఘ‌న‌త త‌మ ప్ర‌భుత్వానికే ద‌క్కుతుంద‌న్నారు.

త‌మ స‌ర్కార్ ఏర్ప‌డిన నాటి నుంచి ముస్లింల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా, మైనార్టీల హక్కులను కాపాడటమే ధ్యేయంగా పని చేస్తున్నామ‌ని చెప్పారు విజ‌య సాయి రెడ్డి. ముస్లింల హక్కు అయిన నాలుగు శాతం రిజర్వేషన్లను ఎత్తేస్తామన్న బీజీపీతో బాబు దోస్తీ క‌ట్టాడంటూ ఎద్దేవా చేశారు.

ముస్లిం సమాజాన్ని అవమానించే పార్టీలు ఒకవైపు అయితే, పేదవాడు అయిన ఖలీల్ అహ్మద్ గారికి అసెంబ్లీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చి పోటీలో నిలబెట్టిన క్రెడిట్ జ‌గ‌న్ రెడ్డికి ద‌క్కుతుంద‌న్నారు.