ట్విట్టర్ లో చేరిన కేసీఆర్
భారీ ఎత్తున ఫాలోయర్స్
హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ఆయన ప్రముఖ సామాజిక మాధ్యమమైన ట్విట్టర్ లో చేరారు. ఈ మేరకు తన ఆసక్తిని శనివారం ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఇక నుంచి వివిధ అంశాలపై తన అభిప్రాయాలను, అనుభవాలను పంచుకోనున్నారు ఈ మాధ్యమం ద్వారా.
ప్రపంచంలోని ప్రతి ఒక్కరు ట్విట్టర్ ను ఉపయోగించుకునే వారు. ప్రముఖులు, ఆటగాళ్లు, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, సెలబ్రిటీస్ , సినీ రంగానికి చెందిన నటీ నటులు, దర్శకులు, టెక్నీషియన్స్ , కవులు, కళాకారులు, రచయితలు, అనువాదకులు, మీడియా ప్రొఫెషనల్స్ , వ్యాపారవేత్తలు, మహిళా మణులు, టాప్ లీడర్స్ ..ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో ఇందులో భాగంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన విశేషాలను అప్ డేట్ చేస్తూ వస్తున్నారు.
దేశంలో అత్యంత జనాదరణ కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు కేసీఆర్. ఆయన ఇవాళ ట్విట్టర్ ఖాతా ప్రారంభించిన వెంటనే పెద్ద ఎత్తున ఫాలోవర్స్ కూడా పెరగడం విశేషం. ఎంతైనా కేసీఆర్ కేసీఆరే కదూ.