దేవుడి సన్నిధిలో వరుణ్ తేజ్
శ్రీ కుక్కుటేశ్వర ఆలయంలో పూజలు
పిఠాపురం – ప్రముఖ నటుడు వరుణ్ తేజ్ శనివారం పిఠాపురం చేరుకున్నారు. ఆయన కుటుంబ సమేతంగా ప్రముఖ ఆలయంగా పేరు పొందిన శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. వరుణ్ తేజ్ తో పాటు తండ్రి కొణిదెల నాగబాబు, తల్లి పద్మతో కలిసి పూజలు చేశారు. ఆయన ఇటీవలే ఓ ఇంటి వాడయ్యాడు. నటి లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నారు.
ఇదిలా ఉండగా ఆలయంలోని కుక్కుటేశ్వరుడు, దత్తాత్రేయుడు, రాజ రాజేశ్వరీ దేవి, పురుహూతికా దేవి అమ్మ వార్లను దర్శించుకున్నారు నటుడు. ప్రత్యేకంగా పూజలు చేశారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ మెగా కుటుంబానికి సాదర స్వాగతం పలికింది. అనంతరం పూజారులు నాగ బాబు, పద్మ, వరుణ్ తేజ్ లకు ఆశీస్సులు అందించారు. తీర్థ ప్రసాదాలు ఇచ్చారు.
కాగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చారు నటుడు. తన తండ్రి సోదరుడు, ప్రముఖ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయనను గెలిపించేందుకు మెగా ఫ్యామిలీ సర్వ శక్తులను ఒడ్డుతోంది. ఎలాగైనా సరే గెలిపించు కోవాలని పట్టుదలతో ఉంది. మొత్తంగా చిరంజీవి, రామ్ చరణ్ , పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ , వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ ఓట్లు తమకు పడతాయని భావిస్తున్నారు.