NEWSINTERNATIONAL

ఆహార ప‌దార్థాల‌లో క్యాన్స‌ర్ కార‌కాలు

Share it with your family & friends

యూరోపియ‌న్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ

యునైటెడ్ కింగ్ డ‌మ్ – భార‌త దేశ ప్ర‌భుత్వానికి బిగ్ షాక్ త‌గిలింది. బ్రిట‌న్ కు చెందిన యూరోపియ‌న్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. శ‌నివారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు ఓ సంచ‌ల‌న నివేదిక బ‌ట్ట బ‌య‌లు చేసింది. ఇందులో ఏకంగా భార‌తీయ ఆహార ప‌దార్థాలు ప్ర‌మాద‌క‌ర‌మైన‌విగా పేర్కొంది.

మొత్తం 527 భార‌త్ కు చెందిన ఆహార ప‌దార్థాల‌లో క్యాన్స‌ర్ కార‌క ఇథ‌లీన్ ఆక్సైడ్ ను కనుగొన్న‌ట్లు వెల్ల‌డించింది. ఇందులో 332 పదార్థాల‌ను దేశీయంగా త‌యారు చేశార‌ని తెలిపింది యూరోపియ‌న్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ.

ప్రధానంగా 313 డ్రై ఫ్రూట్స్, గింజలు, 60 మూలికల‌తో పాటు /సుగంధ ద్రవ్యాలు ఉన్నాయ‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింది. అంతే కాకుండా 48 ఆహార ఉత్పత్తులలో కనుగొనబడింది. కాలుష్యం కారణంగా సరిహద్దుల్లో 87 సరుకులు తిరస్కరించిన‌ట్లు స్ప‌ష్టం చేసింది.

ఆహారం కోసం నిషేధించబడిన ఇథిలీన్ ఆక్సైడ్ తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుందని వెల్ల‌డించింది. దీనిపై కేంద్రం ఇంకా స్పందంచ లేదు.