మోదీ..జనాన్ని భయ పెడితే ఎలా..?
నిప్పులు చెరిగిన మల్లికార్జున్ ఖర్గే
అస్సాం – ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నిప్పులు చెరిగారు. ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఏకి పారేశారు. శనివారం అస్సాంలో పర్యటించారు ఎన్నికలను పురస్కరించుకుని. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు ఖర్గే.
ప్రధాన మంత్రి తనను ఎన్నుకున్న ప్రజలను కేంద్ర దర్యాప్తు సంస్థల పేరుతో భయపట్టేందుకు ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ఆయన గత కొంత కాలం నుంచీ ప్రతిపక్షాలను కావాలని టార్గెట్ చేస్తూ వచ్చారని ఆరోపించారు. కానీ మోదీ తనంతకు తానుగా నియంతనని అనుకుంటున్నాడని అన్నారు.
ప్రజాస్వామ్యంలో ఇది పనికి రాదని స్పష్టం చేశారు మల్లికార్జున్ ఖర్గే. తాము మోదీని భయ పెట్టేందుకు ప్రయత్నం చేయడం లేదన్నారు. బదులుగా తాను ఈడీ, సీబీఐ, ఐటీ పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ వస్తున్నారని ఇది ఎక్కువ కాలం నిలవదన్నారు.
మోదీ పాలకుడు కావాలే తప్పా ప్రజా కంఠకుడు అయితే ఎలా అని మండిపడ్డారు. ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఏనాడైనా ఇలా చేశారా అని ప్రశ్నించారు. ఇకనైనా మోదీ మారాలని లేక పోతే ఓటమి తప్పదన్నారు.