NATIONALNEWS

మోదీ ఏం త్యాగం చేశావో చెప్పు

Share it with your family & friends

నిప్పులు చెరిగిన ప్రియాంక గాంధీ

గుజ‌రాత్ – ఏఐసీసీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ దేశం కోసం ఏం త్యాగం చేశారో మోదీ ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. శ‌నివారం ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా గుజ‌రాత్ లోని వల్సాద్ లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొని ప్ర‌సంగించారు ప్రియాంక గాంధీ.

తమ కుటుంబంలో నాయ‌న‌మ్మ ఇందిరా గాంధీ తూటాల‌కు బ‌ల‌య్యార‌ని, త‌న తండ్రి రాజీవ్ గాంధీ ముక్కలు ముక్క‌లుగా ఇంటికి తీసుకు వ‌చ్చామ‌ని, తమ తాత ముత్తాత‌లు ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశార‌ని చెప్పారు. కానీ మోదీ త‌న జీవితంలో ఒక్క త్యాగం ఏమైనా చేశారా అని నిల‌దీశారు.

ఒక‌వేళ ఉంటే 143 కోట్ల మంది భార‌తీయులు ఆశ‌గా ఎదురు చూస్తున్నార‌ని చెప్పారు. మ‌న్మోహ‌న్ సింగ్ ఈ దేశంలో ప్ర‌ధానిగా విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకు వ‌చ్చార‌ని, ఆర్థిక ప‌రంగా ఇబ్బందుల్లో ఉన్న దేశాన్ని గాడిన పెట్టార‌ని అన్నారు. ప్ర‌తిప‌క్ష నేత‌గా వాజ్ పేయి ఏనాడూ త‌న ప‌రిధి దాట లేద‌న్నారు.

కానీ ప్ర‌జ‌ల‌కు మాయ మాట‌లు చెప్పి, అబ‌ద్దాల‌తో పాల‌న సాగిస్తున్న మోదీ లాంటి ప్ర‌ధానిని చూడ‌లేద‌న్నారు ప్రియాంక గాంధీ.