రాహుల్ కు పెరుగుతున్న ఆదరణ
సామాజిక మాధ్యమాలలో హల్ చల్
న్యూఢిల్లీ – తనను పప్పు అంటూ గేలి చేసినా ఇప్పటి వరకు ప్రజల పక్షాన తన వాయిస్ వినిపిస్తూనే వస్తున్నారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ. ఈ మధ్యన మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం కంటే ఎక్కువగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ప్రజలు ఎక్కువగా గమనిస్తున్నారని తేలి పోయింది.
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో తొలి, రెండో విడత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఆశించిన మేర సీట్లు రావని తేలి పోయింది. ఇక దక్షిణాదిన సత్తా చాటాలని ప్రయత్నం చేస్తోంది. ఈ తరుణంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర పేరుతో రాహుల్ చేపట్టిన యాత్రకు ఊహించని రీతిలో ఆదరణ అన్ని వర్గాల నుంచి లభించింది.
రాహుల్ గాంధీకి రోజు రోజుకు ప్రజాదరణ పెరుగుతుండడంతో బీజేపీ ఆందోళనకు గురవుతోంది. యూట్యూబ్ లో వీక్షకుల పరంగా చూస్తే రికార్డు బద్దలు కొట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 40 శాతం వీక్షించగా , యూపీ కాంగ్రెస్ కు సంబంధించి 14 శాతం, ఆప్ ను 13 శాతం, రాహుల్ గాంధీని 11 శాతంగా ఉంటే మోదీని కేవలం 9 శాతం మాత్రమే వీక్షించడం విశేషం.