రేవంత్ కు భంగపాటు తప్పదు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎదురీదుతోందని అన్నారు. సీఎంకు అంత సీన్ లేదన్నారు. ఆరు గ్యారెంటీలకు దిక్కు లేకుండా పోయిందని, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ప్రజల నుంచి వస్తోందన్నారు.
సొంత జిల్లాలో గెలవడం కష్టమేనని జోష్యం చెప్పారు కేటీఆర్. తాను ఇంఛార్జ్ ఉన్న దగ్గర ఓడి పోతే తపరువు పోతుందని బాధ్యతల నుంచి తప్పుకున్నాడంటూ ఎద్దేవా చేశారు. సవాళ్లను స్వీకరించే దమ్ము , ధైర్యం రేవంత్ రెడ్డికి లేకుండా పోయిందన్నారు. ఇక ప్రజలను సమస్యల నుంచి ఎలా గట్టెక్కిస్తాడంటూ ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ నేతలవి చిల్లర చేష్టలు, ఉద్దెర మాటలంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. ఇప్పటికే హామీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. వారంతా ఇప్పుడు గులాబీ వైపు చూస్తున్నారంటూ చెప్పారు . ఇప్పటికైనా తన తప్పు తెలుసుకుంటే మంచిదని రేవంత్ రెడ్డికి హితవు పలికారు .