NEWSNATIONAL

మోదీకి షాక్ త‌ప్ప‌దు

Share it with your family & friends

సునీతా కేజ్రీవాల్ కామెంట్

న్యూఢిల్లీ – ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ సీరియ‌స్ కామెంట్స్ చేశారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా శ‌నివారం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున ర్యాలీ చేప‌ట్టారు. అనంత‌రం ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు సునీతా కేజ్రీవాల్.

తూర్పు ఢిల్లీ ప్ర‌జ‌లు త‌మ ఓటు ద్వారా త‌న భ‌ర్త‌ను అకార‌ణంగా జైలు పాలు చేసిన మోదీకి, ఆయ‌న ప‌రివారానికి, బీజేపీకి త‌గిన రీతిలో బుద్ది చెప్పేందుకు సిద్ద‌మై ఉన్నార‌ని అన్నారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ అన్న‌ది బ‌క్వాస్ అన్నారు.

ఎవ‌రు నిజాయితీ ప‌రులో , ఎవ‌రు అవినీతి ప‌రులో, ఎవ‌రు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థల పేరుతో రాజ‌కీయాలు చేస్తున్నారో దేశ ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌న్నారు. అరెస్టుల పేరుతో, కేసుల పేరుతో త‌మ‌ను భ‌య పెట్ట‌లేర‌ని హెచ్చ‌రించారు సునీతా కేజ్రీవాల్.

ఈసారి ఢిల్లీ ప్ర‌జ‌లు త‌మ స్వంత సోద‌రుడు, కొడుకుగా భావించే అర‌వింద్ కేజ్రీవాల్ ను మ‌రోసారి ఆశీర్వ‌దించేందుకు సిద్దంగా ఉన్నార‌ని ప్ర‌క‌టించారు. అయినా నిబ‌ద్ద‌త‌తో పాల‌న చేప‌ట్టిన ఆప్ ను చూసి బీజేపీ జంకుతోంద‌న్నారు.