SPORTS

గ‌ర్జించిన సంజూ శాంస‌న్

Share it with your family & friends

రియ‌ల్లీ కెప్టెన్సీ ఇన్నింగ్స్
ల‌క్నో – ఐపీఎల్ 2024లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జైత్ర‌యాత్ర కొన‌సాగుతోంది. జ‌ట్టు ఏదైనా స‌రే , వేదిక ఎక్క‌డున్నా ఓకే. కానీ గెలుపు మాత్రం త‌మ‌దేనన‌ని చాటుతోంది. శ్రీ‌లంక మాజీ స్కిప్ప‌ర్ కుమార సంగ‌క్క‌ర ఎప్పుడైతే రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు మెంటార్ గా, హెడ్ కోచ్ గా వ‌చ్చాడో అప్ప‌టి నుంచి ఆ జ‌ట్టు స్వ‌రూప‌మే మారి పోయింది.

మొత్తంగా గ‌త కొంత కాలంగా భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సంజూ శాంస‌న్ ప‌ట్ల వివ‌క్ష‌ను ప్ర‌ద‌ర్శిస్తూ వ‌స్తోంది. రిష‌బ్ పంత్ పై ఉన్నంత ఫోక‌స్ కేర‌ళ స్టార్ ప‌ట్ల ఉండ‌డం లేదు. దీనిపై పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది సోష‌ల్ మీడియా సాక్షిగా.

దీంతో తానేమిటో, త‌న స‌త్తా ఏమిటో నిరూపించు కోవాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నాడు సంజూ శాంస‌న్. ప‌ట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఐపీఎల్ 17వ లీగ్ లో అత్య‌ధిక ప‌రుగుల జాబితాలో త‌ను కూడా ఒక‌డుగా ఉన్నాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లీ త‌ర్వాతి స్థానం శాంస‌న్ దే.

ఒకానొక స‌మ‌యంలో 78 ప‌రుగుల‌కే కీల‌కమైన 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న జ‌ట్టును త‌న భుజాల‌పై మోశాడు. జ‌ట్టును విజ‌య తీరాల‌కు చేర్చాడు. త‌ను నిజ‌మైన కెప్టెన్ అని నిరూపించాడు సంజూ శాంస‌న్ .