స్కిప్పర్ సూపర్ సంజూ జోర్దార్
అద్భుతమైన కెప్టెన్సీతో జోష్
లక్నో – ఐపీఎల్ 2024లో ఎక్కువగా ఒకే ఒక జట్టు పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆ జట్టు కేరళ స్టార్ సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్. ఇప్పటి వరకు 9 లీగ్ మ్యాచ్ లు ఆడింది. ఇందులో 8 మ్యాచ్ లు గెలుపొందింది. 16 పాయింట్లతో టాప్ లో నిలిచింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఇంకా 5 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.
ప్రధానంగా కెప్టెన్సీ పరంగా , ఆటగాడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు సంజూ శాంసన్. దీనికి ప్రధాన కారణం గత కొంత కాలంగా తను జాతీయ జట్టులో ఆడాలని కోరుకున్నాడు. కానీ బీసీసీఐ సెలెక్టర్లు అతడిపై కక్ష కట్టారు. ఒక రకంగా పంత్ పై ఉన్నంత ప్రేమ సంజూపై కనబర్చడం లేదు.
దీంతో ఐపీఎల్ వేదికగా తానేమితో నిరూపించాలని డిసైడ్ అయ్యాడు శాంసన్. ఆ దిశగా తన ఆటతీరుతో ఆకట్టు కోవడమే కాదు స్కిప్పర్ షోతో తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇక సోషల్ మీడియాలో తను ట్రెండింగ్ లో కొనసాగుతున్నాడు. కారణం ఏమిటంటే జూన్ లో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ జట్టులో ముగ్గురి మధ్య పోటీ నెలకొంది. పంత్ , కేఎల్ రాహుల్, శాంసన్ మధ్య ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఏది ఏమైనా సంజూ శాంసన్ ఇప్పుడు అంది వచ్చిన నాయకుడు. ఆప్ ఎంపీ, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ చెప్పినట్లు రోహిత్ శర్మ తర్వాత సంజూకే కెప్టెన్సీ అప్పగించాలని కోరాడు.