ఇకనైనా సంజూకు ఛాన్స్ దక్కేనా
బీసీసీఐ సెలెక్టర్లకు బిగ్ సవాల్
ముంబై – దేశంలో ఎక్కడా లేని రాజకీయాలు బీసీసీఐలో ఉంటాయి. కేంద్ర మంత్రి అమిత్ షా తనయుడు జే షా చేతుల్లో ఇప్పుడు క్రికెట్ ఆట కొనసాగుతోంది. ఆయన ఎవరిని ఎంపిక చేయాలని ఆదేశిస్తే వాళ్లే జట్టుకు ఎంపికవుతారు. గత కొంత కాలంగా అన్నీ తానై వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఇక జట్టు ఎంపిక విషయానికి వచ్చే సరికల్లా ప్రతీసారి రేసులో ఉన్నప్పటికీ ఎంపిక కావడం లేదు కేరళ స్టార్ సంజూ శాంసన్. అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నా ఏదో ఒక కారణం చెప్పి కేఎల్ రాహుల్ , పంత్ , ఇషాన్ కిషన్ లను కొనసాగిస్తూ వచ్చారు.
అడపా దడపా ఎంపిక చేసినా మైదానంలో ఆడేందుకు మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది సామాజిక మాధ్యమం ట్విట్టర్ , వాట్సాప్ , లింక్డ్ ఇన్, ఫేస్ బుక్ , యూట్యూబ్ వేదికగా.
ఇక ప్రధానంగా జూన్ లో టి20 వరల్డ్ కప్ జరగనుంది. విండీస్, అమెరికా వేదికగా ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెలాఖరులోగా భారత జట్టు ను ప్రకటించాల్సి ఉంది. ఈసారి ఐపీఎల్ 2024 సీజన్ లో అద్బుతమైన ఆట తీరుతో రాజస్థాన్ రాయల్స్ ఆకట్టుకుంటోంది. ప్రధానంగా కెప్టెన్ సంజూ శాంసన్ తానేమిటో నిరూపించుకున్నాడు. బీసీసీఐ సెలెక్టర్లకు సవాల్ విసిరాడు తన ఆట తీరుతో.