SPORTS

పేరెంట్స్ కు జురైల్ సెల్యూట్

Share it with your family & friends

సెన్సేష‌న్ ఇన్నింగ్స్ తో సూప‌ర్
ల‌క్నో – ఐపీఎల్ 2024లో భాగంగా యూపీలోని ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన కీల‌క మైన లీగ్ మ్యాచ్ లో స్వంత గ‌డ్డ‌పై ఆడుతున్న ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కు బిగ్ షాక్ త‌గిలింది. కెప్టెన్ సంజూ శాంస‌న్ సార‌థ్యంలోని రాజ‌స్థాన్ చుక్క‌లు చూపించింది. 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది.

ముందుగా బ్యాటింగ్ కు దిగిన ల‌క్నో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 196 ర‌న్స్ చేసింది. రాజ‌స్థాన్ ముందు 197 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ముందుంచింది. బ‌రిలోకి దిగిన జైశ్వాల్ , బ‌ట్ల‌ర్ 24, 34 ర‌న్స్ చేశారు. అనంత‌రం మైదానంలోకి వ‌చ్చిన రియాన్ ప‌రాగ్ 11 ప‌రుగులు చేసి నిరాశ ప‌రిచాడు.

78 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పియ ఇబ్బందుల్లో ఉన్న స‌మ‌యంలో కెప్టెన్ శాంస‌న్ , ధ్రువ్ జురైల్ అద్భుత‌మైన భాగ‌స్వామ్యంతో ఆక‌ట్టుకున్నారు. జ‌ట్టును విజ‌య తీరాల‌కు చేర్చ‌డంలో కీల‌క పాత్ర పోషించారు.

శాంస‌న్ 33 బంతులు ఎదుర్కొని 71 ర‌న్స్ చేస్తే ఇందులో 7 ఫోర్లు 4 సిక్స‌ర్లు ఉన్నాయి. ఇక యంగ్ క్రికెట‌ర్ ధ్రువ్ జురైల్ 34 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 2 సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. 52 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. హాఫ్ సెంచ‌రీ అనంత‌రం త‌న పేరెంట్స్ కు సెల్యూట్ చేశాడు. ప్ర‌స్తుతం ఇది వైర‌ల్ గా మారింది.