గాడి తప్పిన రేవంత్ పాలన
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి
నాగర్ కర్నూల్ జిల్లా – భారత రాష్ట్ర సమితి పార్టీ చీఫ్ , తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. బస్సు యాత్రలో భాగంగా ఆయన నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా చేపట్టిన రోడ్ షో కు జనం భారీగా హాజరయ్యారు. ప్రజలను ఉద్దేశించి ఉద్వేగ పూరితంగా ప్రసంగించారు.
కేవలం తనపై ఉన్న కోపంతో సీఎం ఊగి పోతున్నాడని , రేవంత్ రెడ్డి రోజు రోజుకు పాలనా పరంగా విఫలం చెందుతున్నాడని అన్నారు. తమ పాలనలో తెలంగాణను అన్ని రంగాలలో ముందంజలో ఉండేలా చేశామన్నారు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి వచ్చాక తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి దాపురించిందని అన్నారు.
ఇక సాగు నీరందక పంటలు ఎండి పోతున్నాయని, పలువురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాడని సీఎంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కేసీఆర్. ఇకనైనా ప్రజలు మేలు కోవాలని, ప్రధానంగా యువత తిరగబడాలని, మీ విలువైన ఓటు పని చేసే వారికి వేయాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ బాస్.