NEWSTELANGANA

రేవంత్ రెడ్డికి ఓట‌మి భ‌యం

Share it with your family & friends

మాజీ మంత్రి హ‌రీశ్ రావు ఫైర్

హైద‌రాబాద్ – సీఎం రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. ఆయ‌న‌కు ఓడి పోతామోన‌న్న భ‌యం ప‌ట్టుకుందన్నారు. అందుకే త‌మ‌పై, పార్టీపై అవాకులు చెవాకులు పేలుతున్నాడంటూ ఆరోపించారు. నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేస్తూ ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు త‌న్నీరు హ‌రీశ్ రావు.

బీఆర్ఎస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయంటూ చెప్పడం దారుణ‌మ‌న్నారు . అబ‌ద్దాలు ప్ర‌చారం చేయ‌డం సీఎంకే చెల్లింద‌న్నారు. పాల‌న చేత‌కాక విమ‌ర్శ‌లు చేయ‌డం అల‌వాటుగా మార్చుకున్నాడంటూ మండిప‌డ్డారు.

అస‌లు భార‌తీయ జ‌న‌తా పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న‌ది నువ్వు కాదా అని ప్ర‌శ్నించారు హ‌రీశ్ రావు. హుజూరాబాద్ , దుబ్బాక‌, మునుగోడుల్లో బ‌ల‌హీన అభ్య‌ర్థుల‌ను నిలిపి.. బీజేపీ గెలిచేందుకు ప‌రోక్షంగా స‌హ‌క‌రించింది నువ్వేన‌ని ఈ రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌న్నారు.

నాగార్జున సాగ‌ర్ లోనూ ఆ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ మంత్రి.