విద్యార్థులకు కేసీఆర్ అభినందన
మరింత ఉన్నతంగా ఎదగాలని పిలుపు
హైదరాబాద్ – ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ గురుకుల కాలేజీల్లో చదివి, ఇంటర్ లో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థినులను స్వయంగా కంగ్రాట్స్ తెలిపారు.
ఇదిలా ఉండగా కోడంగల్ కేజీబీవీలో చదివి స్టేట్ లో తొలి ర్యాంక్ సాధించిన అనూషను కేసీఆర్ ను కలిసిన వారిలో ఉన్నారు. ఆమెను కూడా దగ్గరకు పిలిచి బాగా చదువు కోవాలని సూచించారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అనుకున్నది సాధించడం పెద్ద కష్టం ఏమీ కాదన్నారు కేసీఆర్.
తాను పదేళ్ల కాలంలో సీఎంగా ఉన్న సమయంలో గురుకులాల విద్యపై ఎక్కువగా ఫోకస్ పెట్టానని చెప్పారు. తాను చేసిన ఈ ప్రయత్నమే ఫలితాలు వచ్చేలా చేశాయన్నారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి.
విద్యాభివృద్ది కోసం భారీ ఎత్తున నిధులు మంజూరు చేసిన ఘనత తనదేనని పేర్కొన్నారు.
విద్యా పరంగా విద్యార్థులకు అత్యంత ముఖ్యమైనది 10వ తరగతి అని తెలిపారు. ఇక్కడ ఫోకస్ పెడితే ఇక మరింత ముందుకు వెళ్లేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు కేసీఆర్.