క‌రువుకు కార‌ణం కాంగ్రెస్ ..ఎలినినో కాదు

న‌ల్లగొండ జిల్లా : మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం రైతుల‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎలినినో పేరుతో భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. సీఎం ఆయా రాం గాయా రాం అనే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, పాల‌న పూర్తిగా గాడి త‌ప్పింద‌న్నారు. ఆ పార్టీలో ఎవ‌రు ఎవ‌రి మాట విన‌డం లేద‌న్నారు. ఇక ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ఎలా ప‌రిష్క‌రిస్తారంటూ ప్ర‌శ్నించారు జ‌గ‌దీశ్ రెడ్డి. ఇవాళ ఆయ‌న న‌ల్ల‌గొండ‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న వ‌ర్షాభావ ప‌రిస్థితుల‌కు ప్ర‌ధాన కార‌ణం ఎలినినో కాద‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (NSP)లో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరినప్పటికీ సాగు కోసం కాలువల్లోకి నీటిని విడుదల చేయబోమని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను జగదీష్ రెడ్డి ప్రస్తావించారు. ఆయకట్టులో నెలకొన్న కరువు వంటి పరిస్థితులకు కారణం ‘ఎల్ నినో’ ప్రభావం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఈ పరిస్థితిని సృష్టించిందని మాజీ మంత్రి తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. NSPలో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరినప్పటికీ సాగు కోసం కాలువల్లోకి నీటిని విడుదల చేయబోమని కోమటిరెడ్డి కామెంట్స్ చేయ‌డం త‌గ‌ద‌న్నారు. వరి పంటను సేకరించడం , సన్న రకం వరికి బోనస్ చెల్లించడం వంటి బాధ్యతల నుండి తప్పించుకునేందుకే, రైతులు వరి సాగు చేయకుండా నిరుత్సాహ పరిచేలా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని BRS ఎమ్మెల్యే ఆరోపించారు.

  • Related Posts

    గ్లోబ‌ల్ నాలెడ్జ్ హ‌బ్ గా హైద‌రాబాద్ : సీఎం

    లండన్ : ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని అధికారిక బృందం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన విద్యావేత్తల బృందంతో అత్యంత ఫలప్రదమైన, ఆసక్తికరమైన సమావేశాన్ని నిర్వహించింది. హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి, అంతే కాకుండా ప్రపంచ స్థాయి ‘గ్లోబల్ నాలెడ్జ్ హబ్’…

    కేపీఎస్సీ ఛైర్మన్‌పై చర్యలకు కర్ణాటక కేబినెట్ సిఫార్సు

    బెంగ‌ళూరు : కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ (కేపీఎస్సీ) ఛైర్మన్ శివశంకరప్ప సహుకర్‌పై శిక్షాత్మక చర్యలు తీసుకోవాలని, ఆయనను సస్పెండ్ చేయాలని సిఫార్సు చేస్తూ కర్ణాటక కేబినెట్ తీర్మానించింది. సహుకర్‌కు సంబంధించిన ఆయన నివాసం, కార్యాలయంతో సహా పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *