అమరావతిపై ఫోకస్ పెడతాం
నిర్మాణ పనులు చేపడతాం
మంగళగిరి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఎక్కువగా మంగళగిరి నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. ఈ సందర్బంగా నీరుకొండలో ప్రజలతో ముఖాముఖి చేపట్టారు.
జగన్ రెడ్డి అరాచక పాలనకు చరమ గీతం పాడాలని పిలుపునిచ్చారు. తను ఇంటికి వెళ్లడం ఖాయమని జోష్యం చెప్పారు. ఈసారి టీడీపీ కూటమి పవర్ లోకి వస్తుందని, వచ్చిన వెంటనే అమరావతి రాజధాని పనులు చేపడతామని స్పష్టం చేశారు నారా లోకేష్.
ఇక రాజధాని నగరంలో పేదలకు ఇచ్చే రూ. 5 వేల పెన్షన్ ను కొనసాగిస్తామని పేర్కొన్నారు . అసైన్డ్ రైతులకు ఇవ్వాల్సిన కౌలును కూడా వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పారు . ఇక జగన్ రెడ్డిపై సెటైర్లు వేశారు. గులక రాయి ఘటనలో జగన్ రెడ్డికి ఆస్కార్ అవార్డుకు బదులు అత్తారింటికి దారేది మూవీలో బ్రహ్మానందంకు ఇచ్చే భాస్కర్ అవార్డు ఇవ్వాలన్నారు.
మొత్తంగా నారా లోకేష్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉండడం విశేషం.