రేవణ్ణపై కుమార కామెంట్స్
మహిళలంటే తమకు గౌరవం
కర్ణాటక – రాష్ట్రంలో జేడీఎస్ కు చెందిన మాజీ సీఎం హెచ్ డి కుమార స్వామి మేనల్లుడు ప్రజ్వల్ రేవణ్ణ పై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ మేరకు సీఎం సిట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన ప్రస్తుతం అశ్లీల వీడియోల కుంభకోణం కేసును ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం తను విదేశాల్లో ఉంటున్నాడు. దీనికి సంబంధించి ఆదివారం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు హెచ్ డి కుమార స్వామి.
సీఎం సిట్ విచారణకు ఆదేశించారని, త్వరలోనే విచారణకు సంబంధించిన నివేదిక వస్తుందన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలంటే తమకు ఎనలేని గౌరవమని అన్నారు. హాసన్ కేసులో విచారణ స్టార్ట్ అయ్యిందన్నారు.
వివరాలు బయటకు రావాల్సి ఉందన్నారు. ఎవరు నేరం చేసినా దానికి మూల్యం తప్పక చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు హెచ్ కుమార స్వామి. మేము క్షమించే ప్రసక్తి లేదన్నారు. అయితే ప్రజ్వల్ పూర్ణచంద్ర తేజస్వి ద్వారా వీడియోలు మార్ఫింగ్ చేశారంటూ ఐటీ సెల్ లో ఫిర్యాదు చేశారు.