జనం ఆస్తులతో జగన్ నాటకం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
అమరావతి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ. జనం ఆస్తులతో జగన్ నాటకం ఆడుతున్నాడని ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో జనానికి జగన్ తీరని ద్రోహం తలపెట్టాడని ఆరోపించారు కె. రామకృష్ణ. ఒరిజినల్ ఆస్తి పత్రాలు హక్కుదారులకు ఇవ్వకుండా జిరాక్స్ లతో సరి పెట్టడం వెనుక తాకట్టు కుట్ర దాగి ఉందన్నారు.
క్రిటికల్ రివర్ అనే ప్రైవేటు కంపెనీ వద్ద ప్రజల ఆస్తుల వివరాలు, వేలిముద్రలు స్టోర్ చేయాలని అనుకోవటం దుర్మార్గమన్నారు కె. రామకృష్ణ. ప్రజలు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులపై జగన్ పెత్తనం తగదని స్పష్టం చేశారు.
జగన్ కు మళ్లీ అధికారం ఇస్తే జనం ఆస్తులు కూడా తాకట్టులోకి వెళతాయని హెచ్చరించారు కె. రామకృష్ణ.
వైసీపీని ఓడించడం ద్వారా ఈ ఎన్నికల్లో జగన్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.