హామీల ఊసేది రేవంత్ జాడేది..?
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్
కరీంనగర్ జిల్లా – ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఇప్పుడు దాని ఊసెత్తడం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కరీంనగర్ జిల్లా వేములవాడలో ఆదివారం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్లల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ప్రజల వాణిని వినిపించాలంటే బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాలన్నారు. లేక పోతే వారి తరపున మాట్లాడే వాళ్లు అంటూ ఉండరన్నారు కేటీఆర్. బీజేపీ హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే ఆలోచనలో ఉందని సంచలన కామెంట్స్ చేశారు. దీనిని మనమంతా అడ్డుకుని తీరాలని పిలుపునిచ్చారు.
ఇవాళ ప్రజలు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని, కాంగ్రెస్ ను ప్రత్యేకించి సీఎం రేవంత్ రెడ్డిని నమ్మే స్థితిలో లేరన్నారు కేటీఆర్. రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని బీజేపీ అంటే తాము ఒక్కరమే వ్యతిరేకించామని అన్నారు. ఇకనైనా ప్రజలు గమనించాలని సూచించారు. లేక పోతే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించరాఉ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.
మోదీ ప్రతి ఒక్కరికీ రూ. 15 లక్షలు వేస్తామన్నాడని, పత్తా లేకుండా పోయాడని ఎద్దేవా చేశారు. రూ. 2 లక్షలు రుణ మాఫీ చేస్తానన్న మగోడని అనుకుంటున్న రేవంత్ రెడ్డి ఏడున్నాడని ప్రశ్నించారు కేటీఆర్.