నేహా హత్యపై మౌనమేల..?
నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ
కర్ణాటక – ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిప్పులు చెరిగారు. ఆయన కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ ను లక్ష్యంగా చేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక లోని బెలగావిలో జరిగిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇటీవల కర్ణాటకలో దారుణ హత్యకు గురయ్యారు నేహా. దీనికి ప్రధాన కారకులు ఎవరు అనేది తేల్చక పోవడం దారుణమన్నారు మోదీ. ఈ హత్యను ప్రత్యేకంగా ప్రస్తావించారు మోదీ.
విచిత్రం ఏమిటంటే నేహా హత్య కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం బుజ్జగింపులకు ప్రాధాన్యత ఇస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. హుబ్బల్లిలో ఏం జరిగింది, యావత్ దేశాన్ని కుదిపేసింది. నేహా లాంటి మన కూతుళ్ల ప్రాణాలకు విలువ ఇవ్వక పోవడం దారుణమన్నారు ప్రధానమంత్రి. వారు తమ ఓటు బ్యాంకు గురించి పట్టించు కుంటారే తప్పా ఇలాంటి వాటిపై ఫోకస్ పెట్టరని ఆరోపించారు.
బాధితురాలి కుటుంబం చర్యలు తీసుకోవాలని రోడ్డుపైకి వచ్చిందని, కానీ అక్కడి ప్రభుత్వం చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు నరేంద్ర మోదీ. ఇదిలా ఉండగా ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని నిప్పులు చెరుగుతున్నారు మోదీ.