NEWSNATIONAL

బిలియ‌నీర్ల కోస‌మే పీఎం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన రాహుల్

ఒడిశా – కేవ‌లం కొద్ది మంది బిలియ‌నీర్ల కోస‌మే దేశ ప్ర‌ధానిగా మోదీ ప‌ని చేస్తున్నార‌ని మండిప‌డ్డారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆదివారం ఒడిశా రాష్ట్రంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

మోదీకి అంత సీన్ లేద‌న్నారు. ఆయ‌న‌కు దేశం ప‌ట్ల ప్రేమ కాదు క‌దా ఇసుమంతైనా గౌర‌వం కూడా లేద‌న్నారు. కేవ‌లం ప్ర‌చారం కోసం త‌ను దేశ భ‌క్తుడిలా న‌టిస్తున్నాడ‌ని ఆరోపించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు దేశం కోసం ఆయ‌న ఏం త్యాగం చేశారో చెప్పాల‌ని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఆయ‌న పాల‌నంతా బ‌క్వాస్ అని కొట్టి పారేశారు. జ‌నం ఛీద‌రించు కుంటున్నార‌ని తెలిపారు. ఇవాళ గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా యువ‌త తీవ్ర నిరాశ‌లో ఉంద‌న్నారు .

ఇక కొద్ది మంది చేతుల్లోనే పాల‌న కొన‌సాగుతోంద‌న్నారు. పీఎం ఆఫీసు, కేంద్ర మంత్రి అమిత్ షా , మోదీ వీరు త‌ప్పా ఈ దేశంలో ఎవ‌రి పేర్లు జ‌నాల‌కు తెలియ‌వ‌న్నారు. కార‌ణం వీరే న‌డుపుతున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు. ఈసారి ఎన్నిక‌ల్లో కులం, మ‌తం రాజ‌కీయం న‌డ‌వ‌ద‌న్నారు రాహుల్ గాంధీ.