జగన్ నిర్వాకం ఏపీకి శాపం
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
అమరావతి – కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నిప్పులు చెరిగారు. ఆయన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ది చెందక పోవడానికి ప్రధాన కారణం సీఎం అంటూ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఏపీలో పర్యటించారు. ఈ సందర్బంగా పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడారు.
వేగంగా అభివృద్ది చెందేందుకు కావాల్సిన వనరులు ఉన్నాయని, కానీ ఏపీ సీఎం నిర్వాకం కారణంగా రాష్ట్రానికి శాపంగా మారిందని ఆరోపించారు. తాము రాష్ట్ర అభివృద్దికి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించడం జరిగిందన్నారు. కానీ డెవలప్ మెంట్ పై జగన్ రెడ్డి ఫోకస్ పెట్టలేదని ఫైర్ అయ్యారు పీయూష్ గోయల్.
రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం , జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకోవడం జరిగిందని చెప్పారు. విలువలే ప్రాతిపదికగా తమ పార్టీ పని చేస్తుందన్నారు. ప్రజల బాగు కోసం తాము ప్రయత్నం చేస్తుందన్నారు కేంద్ర మంత్రి.