SPORTS

జాక్స్ జోర్దార్ గుజరాత్ బేజార్

Share it with your family & friends

టైటాన్స్ పై బెంగ‌ళూరు బ‌రా బ‌ర్

అహ్మ‌దాబాద్ – ఐపీఎల్ 2024లో భాగంగా గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు దుమ్ము రేపింది. గుజ‌రాత్ టైటాన్స్ పై గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేశారు. విల్ జాక్స్ అద్భుత‌మైన సెంచ‌రీతో ఆక‌ట్టుకోగా ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ షాన్ దార్ ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు.

ఏకంగా గుజ‌రాత్ టైటాన్స్ పై 9 వికెట్ల తేడాతో అద్భుత గెలుపు న‌మోదు చేసింది. దీంతో ప్లే ఆఫ్స్ పై ఆశ‌లు పెట్టుకుంది ఆర్సీబీ. జాక్స్ 100 ర‌న్స్ చేస్తే విరాట్ 70 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు. గుజ‌రాత్ టైటాన్స్ ముందుగా బ్యాటింగ్ చేసి 200 ర‌న్స్ టార్గెట్ ముందుంచింది.

టైటాన్స్ ఇచ్చిన ల‌క్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించారు ఆర్సీబీ ఆట‌గాళ్లు. కేవ‌లం 15.5 ఓవ‌ర్ల‌లోనే ప‌ని ఖ‌తం చేశారు. ఓపెనింగ్ కు వ‌చ్చిన ఫాఫ్ డుప్లెసిస్ కేవ‌లం 24 ప‌రుగులు చేసి ఔట్ అయ్యాడు. అనంత‌రం మైదానంలోకి వ‌చ్చిన ర‌న్ మెషీన్ మ‌రో వికెట్ పోకుండా జాగ్ర‌త్త ప‌డ్డాడు. త‌న అనుభ‌వాన్ని రంగ‌రించి అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాడు. చివ‌ర‌కు త‌న జ‌ట్టుకు విజ‌యం చేకూర్చి పెట్ట‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.