SPORTS

సాయి సుద‌ర్శ‌న్ సూప‌ర్ షో

Share it with your family & friends

అయినా త‌ప్ప‌ని ఓట‌మి

గుజ‌రాత్ – అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ లో అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాడు గుజ‌రాత్ టైటాన్స్ ఆట‌గాడు సాయి సుద‌ర్శ‌న్. 48 బంతులు ఎదుర్కొన్న యువ క్రికెట‌ర్ 84 ర‌న్స్ చేశాడు. త‌న‌దైన శైలిలో ఆడుతూ స్కోర్ బోర్డు ప‌రుగులు పెట్టించాడు.

ఇక మ‌రో యంగ్ క్రికెట‌ర్ షారుఖ్ ఖాన్ తానేమీ త‌క్కువ కాదంటూ రెచ్చి పోయాడు. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు ఇద్ద‌రు ఆట‌గాళ్లు. ఖాన్ 58 ర‌న్స్ చేశాడు. గ్రౌండ్ న‌లు వైపులా షాట్స్ తో ఆక‌ట్టుకున్నాడు.

ఒక ర‌కంగా చెప్పాలంటే ఈసారి జ‌రుగుతున్న 17వ ఐపీఎల్ సీజ‌న్ మాత్రం పూర్తిగా బ్యాట‌ర్ల‌కు స్వ‌ర్గ ధామంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే ప్ర‌తి జ‌ట్టు 200 స్కోర్ ను దాటేస్తూ స్కోర్ సాధిస్తోంది. దీంతో ఛేజింగ్ లో సైతం స‌త్తా చాటుతున్నాయి మ‌రికొన్ని జ‌ట్లు.

గ‌త సీజ‌న్ లో ఆశించిన మేర రాణించ లేక పోయిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ప్ర‌స్తుతం ప‌రుగుల వ‌ర‌ద పారిస్తోంది. త‌మ స్వంత మైదానంలో షాన్ దార్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంటోంది.