NEWSTELANGANA

కేసీఆర్ కామెంట్స్ బండి సీరియ‌స్

Share it with your family & friends

హిందువులు బొందుగాళ్లంటే ఎలా

క‌రీంన‌గ‌ర్ జిల్లా – భార‌తీయ జ‌న‌తా పార్టీ మాజీ చీఫ్ , క‌రీంన‌గ‌ర్ సిట్టింగ్ ఎంపీ బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ నిప్పులు చెరిగారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. చింత చ‌చ్చినా పులుపు చావ‌ద‌న్న‌ట్టు కేసీఆర్ లో ఇంకా అహంకారం పోలేద‌న్నారు. తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌నం బీఆర్ఎస్ ను బండ కేసి కొట్టినా ఇప్ప‌టి వ‌ర‌కు ప‌శ్చాతాప‌మే లేక పోవ‌డం దారుణ‌మ‌న్నారు. చ‌రిత్ర కేసీఆర్ ను క్ష‌మించ‌ద‌ని పేర్కొన్నారు బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్.

పాల‌మూరు కేంద్రంలో జ‌రిగిన బ‌స్సు యాత్ర‌లో పాల్గొన్న కేసీఆర్ హిందువుల‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు సిట్టింగ్ ఎంపీ. ఇది పూర్తిగా తాము ఖండిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఈసారి జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కేసీఆర్ కు చుక్కుల చూపించ‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

హిందూ వ్య‌తిరేకి కేసీఆర్ ను బండ కేసి కొట్టాల‌ని, బీఆర్ఎస్ పార్టీని బొంద‌లో పెట్టాల‌ని పిలుపునిచ్చారు బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌కు. . అన్యమతస్థుల ఓట్ల కోసం, హిందువుల మనోభావాలను అవమాన పరిచే హక్కు కేసీఆర్ కు లేదన్నారు.