తుషార్ దెబ్బకు సన్ రైజర్స్ షాక్
27 పరుగులకే 4 కీలక వికెట్లు
చెన్నై – ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంది. ప్లే ఆఫ్స్ ఆశలు ఇంకా అలాగే ఉంచుకుంది. మరోసారి ధోనీ సేన మ్యాజిక్ చేసింది. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో సత్తా చాటింది. తనకు ఎదురే లేదని మరోసారి చాటి చెప్పింది.
ప్రధానంగా చెప్పు కోవాల్సింది తుషార్ దేశ్ పాండే. కేవలం 4 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చి సన్ రైజర్స్ ఆశలపై నీళ్లు చల్లాడు. అద్భుతమైన బంతులతో అదరగొట్టాడు. ఒకానొక దశలో హైదరాబాద్ ప్లేయర్లు డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.
213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ ఆర్ హెచ్ ఏ కోశాన పోటీ ఇవ్వలేక పోయింది. ఇదే టోర్నీలో ప్రత్యర్థులపై భారీ స్కోర్ చేసి విస్తు పోయేలా చేసిన హైదరాబాద్ జట్టేనా ఇది అన్న అనుమానం ఫ్యాన్స్ లో నెలకొంది.
దేశ్ పాండేకు తోడు పతిరాన కూడా 27 రన్స్ ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. ఈ సమయంలో అభిషేక్ శర్మ, మార్క్ రమ్ గట్టెక్కించేందుకు ప్రయత్నం చేశారు. కానీ వర్కవుట్ కాలేదు. మర్క రమ్ ఒక్కడే 32 రన్స్ చేశాడు.
క్లాసెన్ 20 రన్స్ చేస్తే సమద్ 19 పరుగులు చేశాడు. షెహబాజ్ 7 రన్స్ చేస్తే కమిన్స్ మరో 7 పరుగులకే పెవిలియన్ దారి పట్టారు. దీంతో హైదరాబాద్ 134 కే కుప్ప కూలింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 78 పరుగులతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది.