రేవంత్ బీజేపీలోకి రావడం పక్కా
దేశంలో కాంగ్రెస్ ఖాళీ అవుతుంది
నిజామాబాద్ – భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై సీరియస్ కామెంట్స్ చేయడం కలకలం రేపింది. కేసీఆర్ ఉన్న సమయంలో బీజేపీని కాస్తా కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం చేశాడని అన్నారు. కానీ రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదన్నారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోవడం ఖాయమని జోష్యం చెప్పారు. ధర్మపురి అరవింద్ మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తు అంతా భారతీయ జనతా పార్టీదేనని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యాక రాష్ట్రంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయని , ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడం పక్కా అని, ఆయన కూడా బీజేపీలోకి చేరుతాడని జోష్యం చెప్పారు ధర్మపురి అరవింద్. ఇదిలా ఉండగా కాంగ్రెస్ సర్కార్ మూణ్ణాళ్ల ముచ్చటగా అభివర్ణించారు.