NEWSANDHRA PRADESH

జ‌గ‌న్ మేనిఫెస్టో బ‌క్వాస్

Share it with your family & friends

నారా చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి – తెలుగుదేశం పార్టీ చీఫ్‌, మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ప్ర‌జా గ‌ళం పేరుతో చేప‌ట్టిన భారీ బ‌హిరంగ స‌భ‌కు పెద్ద ఎత్తున జ‌నం త‌ర‌లి వ‌చ్చారు. దీంతో సంతోషాన్ని వ్య‌క్తం చేశారు టీడీపీ పార్టీ అధినేత‌.

ఈ సంద‌ర్బంగా ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. వైసీపీ విడుద‌ల చేసిన మేని ఫెస్టో పూర్తిగా బ‌క్వాస్ అంటూ ఎద్దేవా చేశారు. ఐదేళ్ల పాటు చూపించిన న‌ర‌కాన్ని మ‌రో ఐదేళ్ల పాటు చూపిస్తామ‌న్న‌ట్టుగా వైసీపీ మేనిఫెస్టో ఉందంటూ ధ్వ‌జ‌మెత్తారు.

జ‌గ‌న్ రెడ్డిని త‌న్ని త‌రిమి కొట్టే రోజు త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌న్నారు. ఇవాళ కౌతాళం, గూడురుల‌లో వెల్లువ‌లా వ‌చ్చిన జ‌నాన్ని చూస్తే ఇక జ‌గ‌న్ ప‌నై పోయింద‌ని అనిపిస్తోంద‌ని అన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. టీడీపీ కూట‌మికి క‌నీసం 170 సీట్లు వ‌స్తాయ‌ని ధీమా వ్య‌క్తం చేశారు .