బాబూ ఏమిటీ పిచ్చి ప్రేలాపన
విజయ సాయి రెడ్డి కామెంట్స్
నెల్లూరు జిల్లా – వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయ సాయి రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సభలకు జనం రానంత మాత్రాన ప్రజలు ఇంటికో కర్ర పట్టుకుని రోడ్డు మీదకు రావాలంటూ బాబు పిలుపు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ఇదేనా మీకున్న రాజకీయ అనుభవం అంటూ ప్రశ్నించారు. ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు పలకడం మానుకోవాలని హితవు పలికారు ఎంపీ విజయ సాయి రెడ్డి.
ఎవరిని తరిమి కొట్టాలి..ఎవరిపై మీరు దాడి చేయమని చెబుతున్నారంటూ ప్రశ్నించారు. ఇదేనా మీకున్న తెలివి. ఇదేనా మీ సంస్కారం. ఇలాగేనా మాట్లాడేది. మీ కొడుకు సుద్ద పప్పును సీఎం చేయాలన్న మీ కోరక ఇప్పట్లో తీరేది కాదన్నారు. ఇలాంటి ప్రయత్నాలు మానుకుంటే మంచిదని సూచించారు విజయ సాయి రెడ్డి.
దమ్ముంటే ప్రత్యక్ష రాజకీయాలలో చూసు కోవాలని సవాల్ విసిరారు వైసీపీ ఎంపీ అభ్యర్థి. ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోక పోతే జనం నిన్ను కర్రలు తీసుకుని తరిమే రోజు తప్పకుండా వస్తుందన్నారు.