NEWSTELANGANA

చేవెళ్ల‌కు రుణ‌ప‌డి ఉన్నా

Share it with your family & friends

గెలిచినా ఓడినా ఇక్క‌డే ఉంటా

రంగారెడ్డి జిల్లా – భార‌తీయ జ‌న‌తా పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్య‌ర్థి కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను గెలిచినా ఓడినా చేవెళ్ల‌ను విడిచి ఎక్క‌డికీ వెళ్ల‌న‌ని అన్నారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా సోమ‌వారం ప‌ర్య‌టించారు. ఆయ‌న‌తో పాటు త‌న భార్య డాక్ట‌ర్ సంగీతా రెడ్డి కూడా ఆయ‌న‌తో పాటే ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్బంగా నిర్వ‌హించ‌ని రోడ్ షోకు భారీ ఎత్తున జ‌నం పోగ‌య్యారు. విచిత్రం ఏమిటంటే దేశంలోనే అత్య‌ధిక ధ‌న‌వంతుల ఎంపీల జాబితాలో మ‌నోడిది రండో స్థానం కావ‌డం విశేషం. ఏకంగా రూ. 4,500 కోట్ల‌కు పైగానే ఆస్తులు ఉన్న‌ట్లు ఎన్నిక‌ల అఫిడ‌విట్ లో పేర్కొన్నారు.

దేశంలో సుస్థిర‌మైన పాల‌న‌, స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వాన్ని అందించే ఏకైక పార్టీ ఒక్క భార‌తీయ జ‌న‌తా పార్టీనేన‌ని అన్నారు కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి. తాను ఇచ్చిన మాట మేర‌కు చెప్పిన‌వ‌న్నీ అమ‌లు చేసి తీరుతాన‌ని చెప్పారు. చేవెళ్ల‌ను తాను మ‌రిచి పోలేన‌ని అన్నారు. తాను గెలిచినా ఓడినా మీతో పాటే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు బీజేపీ ఎంపీ అభ్య‌ర్థి.

కాంగ్రెస్ ప‌నై పోయింద‌ని, త‌మ పార్టీకి క‌నీసం 400 సీట్ల‌కు పైగా వ‌స్తాయ‌ని జోష్యం చెప్పారు. కొండా భార్య సంగీతా రెడ్డి ప్ర‌సంగిస్తూ త‌న భ‌ర్త అమాయ‌కుడ‌ని, ఈసారి ఎలాగైనా గెలిపించాల‌ని కోరారు.