ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయం
రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం జిల్లా – టీడీపీ కూటమిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై స్పందించారు. కూటమి కావాలని రాద్దాంతం చేస్తోందని ఆరోపించారు.
ఈసారి ఆయన కేంద్ర సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భూములపై కొత్త టైటిలింగ్ యాక్ట్ తీసుకు రావాలన్నది బీజేపీ ఆలోచన అని మండిపడ్డారు. తాము ఎప్పటికీ రైతులకు , భూమి హక్కుదారులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.
తమపై ఒత్తిడి తెస్తున్న బీజేపీతో చంద్రబాబు నాయుడు ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఈ యాక్టు గురించి పదే పదే ప్రస్తావించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
దేశ వ్యాప్తంగా ఆ దీనిపై ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే ఆలోచన చేస్తామన్నారు ధర్మాన ప్రసాదరావు:
న్యాయస్థానాల్లో దాఖలైన పిటిషన్లపై తీర్పులు తర్వాత మాత్రమే ఆలోచిస్తామని ఇప్పటికే చెప్పామన్నారు.
ల్యాండ్ టైటిలింగ్ యక్ట్ అన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదన్నారు. రైతులకు మేలు చేసేలా అనేక సంస్కరణలు చేశామన్నారు. సమగ్ర సర్వే ద్వారా ఎంతో మేలు చేకూరుతోందన్నారు. అత్యాధునిక టెక్నాలజీని సర్వే కోసం వినియోగించామని చెప్పారు.