ఈ ఎన్నికలు ఏపీకి ముఖ్యం
ఏపీ సీఎం జగన్ రెడ్డి కామెంట్
అనకాపల్లి జిల్లా – రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికల్లో ఆచి తూచి విలువైన ఓటు వేయాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. మేమంతా సిద్దం యాత్రలో భాగంగా సోమవారం అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం కొత్తూరు జంక్షన్ లో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు.
మండు టెండలను సైతం లెక్క చేయకుండా సభకు వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు జగన్ రెడ్డి. పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని పేర్కొన్నారు. మరో రెండు వారాల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగనుందన్నారు
ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావన్నారు మనం వేసే ఓటుతో రాబోయే 5 ఏళ్లలో మీ ఇంటింటి అభివృద్ధిని, పేద కుటుంబాల భవిష్యత్తును, పేదల తల రాతలను నిర్ణయించ బోయే ఎన్నికలు ఇవి అని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలన్నారు.
మోసం చేయడం బాబు నైజమన్నారు. ఆయన గత చరిత్ర అంతా మోస పూరితమేనని ఆరోపించారు. బాబును నమ్మటం అంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టినట్లేనని హెచ్చరించారు.