NEWSANDHRA PRADESH

జ‌గ‌న్ నాటకం జ‌నం మోసం

Share it with your family & friends

టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి – ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగారు టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాము పెన్ష‌న్లు ఇవ్వ‌మ‌ని ఎప్ప‌టి నుంచో చెబుతూ వ‌చ్చామ‌ని అన్నారు. కానీ జ‌గ‌న్ రెడ్డి ప‌ట్టించు కోలేద‌ని ఆరోపించారు.

ఇదే విష‌యాన్ని తాము ఎన్నిక‌ల అధికారికి కూడా స్ప‌ష్టం చేయ‌డం జ‌రిగింద‌న్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. కానీ కావాల‌ని త‌మ‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

ఈనెల పెన్ష‌న్ల‌ను ఇళ్ల వ‌ద్ద‌కే తీసుకు వ‌చ్చి ఇవ్వ‌మ‌ని కోరామ‌న్నారు చంద్ర‌బాబు నాయుడు. ఇది పూర్తిగా సాధ్య‌మ‌వుతుంద‌ని స్ప‌ష్టం చేశామ‌న్నారు. కానీ మ‌రోసారి ప్ర‌భుత్వం తిరిగి నాట‌కాలు మొద‌లు పెట్టింద‌ని ఆరోపించారు.

విచిత్రం ఏమిటంటే ఈసారి ఇంటికి తెచ్చి ఇవ్వ‌కుండా బ్యాంకు అకౌంట్లో వేస్తామ‌ని చెప్ప‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు టీడీపీ చీఫ్‌. కింద‌టి నెల ఈ ప‌నే చేయ‌మ‌ని తాము కోరామ‌ని , కానీ తమ వ‌ద్ద అంద‌రి బ్యాంకు అకౌంట్లు లేవ‌ని అబ‌ద్దం చెప్పారంటూ ఫైర్ అయ్యారు.