ఏపీలో ఫ్యాన్ దే హవా
కూటమికి ఓటమి తప్పదు
అమరావతి – ఏపీలో రాజకీయ సంకుల సమరం కొనసాగుతోంది. మే 13న రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ జరగనుంది. ఈ సందర్బంగా దేశ వ్యాప్తంగా మీడియా, సర్వే సంస్థలన్నీ గంప గుత్తగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలతో కూడిన కూటమి గెలుస్తుందని పేర్కొంటున్నాయి.
కానీ ప్రజల్లో అత్యధికంగా జగన్ రెడ్డి ఉంటేనే బాగుంటుందని అనుకుంటున్నారని మరికొన్ని సర్వే సంస్థలు తెలిపాయి. ఇంకా పోలింగ్ కు కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. రోజు రోజుకు అంచనాలు తారుమారు అవుతున్నాయి. జగన్ రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు మంచి ఫలితాలు అందించనున్నాయని, అవే తమను గట్టెక్కిస్తాయని వైసీపీ బాస్ భావిస్తున్నారు.
ఈ తరుణంలో అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి కనీసం 96 నుంచి 105 స్థానాలు రానున్నాయని అంచనా. మరో వైపు టీడీపీ కూటమికి 69 నుంచి 76 వరకే పరిమితం కాబోతోందని, మొత్తంగా కూటమి గట్టి పోటీ ఇవ్వనుందని సమాచారం. కాగా ఈ విషయాన్ని జగన్ రెడ్డే బహిరంగంగా ప్రకటించడం విశేషం.