మోడీకి జగన్ దత్త పుత్రుడు
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
అమరావతి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో సంచలన ఆరోపణలు గుప్పించారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. ప్రస్తుతం సోదర, సోదరీమణుల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. నువ్వా నేనా అన్న రీతిలో రాజకీయం కొనసాగుతోంది.
తనను అభాసుపాలు చేసేందుకే చెల్లెళ్లు రంగంలోకి దిగారని ఆరోపించారు జగన్ రెడ్డి. ఈ సమయంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ న్యాయ యాత్ర కాకినాడ , పోలవరం, రాజమండ్రి నియోజకవర్గాలలో వైఎస్ షర్మిల పర్యటించారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున తనను ఆదరించిన జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
ఆమె జగన్ రెడ్డిని ఏకి పారేశారు. తన తండ్రి, దివంగత సీఎం, మహా నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన జీవిత కాలమంతా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నారని చెప్పారు వైఎస్ షర్మిల. ఆయన వారసుడినంటూ పార్టీ పెట్టి, ప్రజా యాత్ర చేపట్టి, జనంలోకి వెళ్లి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ఆ తర్వాత తండ్రిని మరిచి పోయాడని, చెల్లిని దూరం పెట్టాడని ఆరోపించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జగన్ మోహన్ రెడ్డి దత్త పుత్రుడంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను చెప్పడం లేదని సాక్షాత్తు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతా రామన్ చెప్పారంటూ తెలిపారు.