జగన్ రెడ్డి చాప్టర్ క్లోజ్
పవన్ కళ్యాణ్ కామెంట్
అమరావతి – జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం జగన్ రెడ్డి పనై పోయిందన్నారు. ఆయన ఇక పెట్టే బేడా సర్దుకుని ఇంటికి వెళ్లడం మాత్రమే మిగిలి ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తాడేపల్లి గూడెంలో పర్యటించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
జగన్ రెడ్డి కుటుంబం గురించి ప్రస్తావించారు. ఆయన తాత రాజా రెడ్డి మైనింగ్ కంపెనీలో కూలిగా పని చేశాడని, తీరా ఆ కంపెనీనే లాక్కున్న దుర్మార్గమైన చరిత్ర వారి ఫ్యామిలీదంటూ సంచలన ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్.
కానీ తాము కష్టపడి ఈ స్థాయికి వచ్చామని, నీలాగా , నీ కుటుంబం లాగా దౌర్జన్యాలకు ఏనాడూ దిగ లేదన్నారు. ఇక జగన్ రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. నీ చీకటి చరిత్ర గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు.
ఇన్ని వందల కోట్లు ఎలా వచ్చాయో , ఏ రకంగా సంపాదించావో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక కూటమి గెలుపును ఏ శక్తి అడ్డు కోలేదన్నారు జనసేనాని.